ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన – ఆర్ఎస్పీ
సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. మంగళవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. అస్సలు రాష్ట్రంలో ప్రభుత్వం అనేది ఉందా అన్న అనుమానం కలుగుతోందని ఆవేదన చెందారు.
తెలంగాణలో ఏం జరుగుతోంది? లా అండ్ ఆర్డర్ ఏమైనా ఉందా? ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల శాసన సభ్యుడిగా ఉన్న కేటీఆర్ కు బాధితులను పరామర్శించే హక్కు లేదా అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డిని.
తన రాజ్యాంగ విధులను నిర్వర్తించే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఎవరికి ఉంది? నిన్న కూడా పోలీసు కమీషనర్ కార్యాలయం పక్కనే ఉన్న తెలంగాణ భవన్‌పై కాంగ్రెస్ పెయిడ్ గూండాలు దాడి చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డీ మీ పిరికి రాజకీయాలు మానేసి పాలనపై దృష్టి పెట్టండని హితవు పలికారు. ప్రజా పాలన అంటే ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్షంపై దాడులు చేయడమా? వీధి రౌడీలకు చిరునామా కాంగ్రేసు పార్టీ మారిందని మండిపడ్డారు ఆర్ఎస్పీ.
మీది ప్రజా పాలన కాదు, ప్రతీకారపాలన. త్వరలోనే భారీ మూల్యం చెల్లించు కోవడం తప్పదని హెచ్చరించారు. శ్రీలంకలో రాజపక్షలా రేవంత్ రెడ్డిని తెలంగాణ ప్రజలు పారదోలే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు.