NEWSNATIONAL

ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ లపై క‌ఠిన చ‌ట్టాలు ఉండాలి

Share it with your family & friends

పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్

మ‌హారాష్ట్ర – రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహ‌న్ భ‌గ‌వత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ల నిర్వాకంపై సీరియ‌స్ అయ్యారు. ఎలాంటి నియంత్ర‌ణ లేకుండా పోతోంద‌ని మండిప‌డ్డారు. అస‌లు కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ, మోడీ స‌ర్కార్ ఏం చేస్తోందంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మోహ‌న్ భ‌గ‌వ‌త్.

ఆర్ఎస్ఎస్ వందేళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా శ‌నివారం నాగ్ పూర్ లో జ‌రిగిన స‌మావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్ర‌సంగించారు ఆర్ఎస్ఎస్ చీఫ్‌. రోజు రోజుకు ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ లు గ‌తి త‌ప్పుతున్నాయ‌ని, ఎక్కువ‌గా జుగుస్సాక‌రంగా ఉంటున్నాయ‌ని, నేరాన్ని ప్రోత్స‌హించేలా ఉంటున్నాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

భారతీయ సంస్కృతి, సంప్ర‌దాయాల‌కు భంగం క‌లిగించేలా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ ల‌లో కంటెంట్ ఉంటోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. చాలా కంటెంట్ అసహ్యంగా ఉందన్నారు, దానిని ప్రస్తావించడం కూడా మర్యాదను ఉల్లంఘించినట్లు అవుతుందని ఫైర్ అయ్యారు. మన‌ ఇళ్లకు చేరే వికృత దృశ్య కంటెంట్‌పై తక్షణమే చట్టాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

యువతలో మాదక ద్రవ్య వ్యసనం వేగంగా వ్యాప్తి చెందుతోందని వాపోయారు, సమాజాన్ని బలహీనంగా చేస్తోంద‌న్నారు. “మాతృవత్ పరదారేషు” అని నమ్మే దేశంలో చాలా చోట్ల అత్యాచారాల వంటి సంఘటనలు జరుగుతుండ‌టం దారుణ‌మ‌న్నారు. సద్గుణాన్ని పెంపొందించే అలవాట్లను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు మోహ‌న్ భ‌గ‌వత్.