డాక్టర్ అత్యాచార ఘటన దారుణం
ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత కామెంట్స్
పశ్చిమ బెంగాల్ – రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సీనియర్ నాయకుడు ఇంద్రేష్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు ఇవాళ. కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జరిగిన అత్యాచారం , హత్య ఘటన దారుణమన్నారు. ఇది అత్యంత బాధాకరమైన విషయమన్నారు. దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని పేర్కొన్నారు.
మహిళలను గౌరవించడం , రక్షించడం కంటే, పార్టీలు , నాయకులు వారిపై అఘాయిత్యాలను ప్రోత్సహించడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత. ఇది అత్యంత దురదృష్టకరమన్నారు.
ఢిల్లీలో, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన స్వంత నివాసంలో తన పార్టీకి చెందిన ఎంపీని అవమానించారని, అయినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కనీసం మాట వరుసకైనా నోరు విప్ప లేదని , వీళ్లు మనకు నాయకులుగా ఉండడం దౌర్భాగ్యం కాక మరేమిటని ప్రశ్నించారు ఇంద్రేష్ కుమార్.
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఏం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం జరగాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు ఆర్ఎస్ఎస్ సీనియర్ నేత.