కేటాయిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్ – ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మహిళా సంఘాలకు తీపి కబురు చెప్పింది. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తూ జీవో జారీ చేసింది. తొలి విడతలో 150 మండల మహిళా సమాఖ్యలకు 150 ఆర్టీసీ అద్బె బస్సులను కేటాయించింది. మిగతా మండల సమాఖ్యలకు 450 ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయించనున్నట్లు తెలిపింది.
ప్రతి నెలా ఒక్కో అద్దె బస్సుకు రూ. 77 వేల 220 రూపాయలు చెల్లించనుంది టీజీఆర్టీసీ. బస్సుల కొనుగోలు కోసం మహిళా సంఘాలకు బ్యాంకు గ్యారంటీ ఇవ్వనుంది సర్కార్. మహిళా సంఘాలకు బస్సులను కేటాయించడం దేశంలోనే తొలిసారి కావడం విశేషం.
ఇప్పటికే మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును నిర్వహిస్తున్నారు. ఇది మహిళా సాధికారతకు దర్పణంగా నిలుస్తుందని అన్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఇవాళ సంక్షేమ కార్యక్రమాలలో పెద్ద పీట వేస్తున్నామన్నారు.