అంగరంగ వైభోగంగా రుద్ర యాగం
శ్రీ కపిలేశ్వర ఆలయంలో ప్రారంభం
తిరుపతి – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ కపిలేశ్వర స్వామి వారి హోమం (రుద్ర యాగం) శాస్త్రోక్తంగా అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. నెల రోజుల పాటు జరుగుతున్న హోమ మహోత్సవాల్లో భాగంగా నవంబరు 29వ తేదీ వరకు 11 రోజుల పాటు ఈ హోమం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం పూజ, రుద్ర జపం, హోమం, లఘు పూర్ణాహుతి, నివేదన, హారతి నిర్వహించారు. సాయంత్రం పూజ, జపం, హోమం, రుద్రత్రిశతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి ఇచ్చారు.
రుద్ర యాగం సందర్బంగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.