మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం
దేశాధ్యక్షుడు పుతిన్ కు ధన్యవాదాలు
రష్యా – భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీకి అరుదైన గౌరవం లభించింది. రష్యా పర్యటన ముగించుకున్న ఆయన తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్బంగా రష్యా, భారత దేశాల మధ్య సత్ సంబంధాలు నెలకొనేందుకు ఇరువురు నేతలు ప్రయత్నం చేశారు. తమ బంధాన్ని ఎవరూ చెరప లేరంటూ ప్రకటించారు మోడీ, పుతిన్.
ఇదిలా ఉండగా ప్రధాన మంత్రికి ఊహించని రీతిలో అరుదైన బహుమానం అందింది. రష్యా దేశంలోనే అత్యున్నతమైన పౌర పురస్కారం ఇస్తున్నట్లు ప్రకటించారు దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రికి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ ది ఫస్ట్ కాల్డ్ అవార్డును బహూకరించారు. బంగారు పతకాన్ని మోడీ మెడలో వేశారు పుతిన్.
రష్యా, భారత్ మధ్య విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అభివృద్ది చేయడంలో , రెండు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలను పెంపొందించడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కృషి చేశారని పేర్కొన్నారు. అందుకే ఆయనకు తమ దేశం తరపున అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేశామన్నారు పుతిన్.