మోడీ నన్ను అర్థం చేసుకోగలరు – పుతిన్
ఇక అనువాదకుడు అవసరం లేదు
రష్యా – రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎక్కడికైనా వెళ్లినప్పుడు ఆయా దేశాలకు సంబంధించి భాషా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అనువాదకులు ఉంటారు. ఇది సర్వ సాధారణమైన విషయం.
కానీ ఇందుకు భిన్నంగా రష్యాలోని కజాన్ లో జరుగుతున్న బ్రిక్స్ సమ్మిట్ లో ఓ సంఘటన చోటు చేసుకుంది. బ్రిక్స్ సమావేశానికి హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కజాన్ లో ఘన స్వాగతం పలికింది. గత కొన్నేళ్లుగా భారత్ రష్యాతో మిత్రపక్షంగా ఉంటూ వస్తోంది.
ఈ కీలక సమావేశానికి రష్యా దేశం ఆతిథ్యం ఇస్తుండగా చైనా, ఇరాన్, భారత్, తదితర దేశాల అధినేతలు సదస్సుకు హాజరయ్యారు. చైనా, భారత్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తొలగించేందుకు చొరవ చూపారు
రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్. ఈ సందర్బంగా అటు జింగ్ పిన్ ఇటు మోడీ మధ్యలో పుతిన్ ఉండడం అందరినీ విస్తు పోయేలా చేసింది.
ఇదిలా ఉండగా పుతిన్ మాట్లాడుతున్న సమయంలో తనకు అనువాదకుడు అవసరం లేదని స్పష్టం చేశారు. తాను చెప్పేది పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అర్థం అవుతుందని, ఆయన తన భావాలను అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు పుతిన్. సో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రాధాన్యత సంతరించుకున్నాయి.