రుతురాజ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్
2 పరుగుల తేడాతో సెంచరీ మిస్
చెన్నై – ఐపీఎల్ 2024లో భాగంగా చెన్నైలో జరిగిన లీగ్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 8 పరుగులకే అజింక్యా రహానే పెవిలియన్ బాట పట్టగా ఆనందంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశలపై నీళ్లు చల్లారు రుతురాజ్ , డారిల్ మిచెల్.
ఎడా పెడా బౌలర్లను చితక బాదారు. పరుగుల వరద పారించారు. రుతురాజ్ గైక్వాడ్ 98 రన్స్ చేశాడు. ఇందులో 10 ఫోర్లు 3 సిక్సర్లు ఉన్నాయి. డారిల్ మిచెల్ 52 తో ఆకట్టుకున్నాడు. ఇద్దరూ కలిసి 2వ వికెట్ కు భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హైదరాబాద్ బౌలర్లు ఎంత ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది.
చివరలో ఈ ఇద్దరు వెనుదిరిగినా సన్ రైజర్స్ ముందు భారీ స్కోర్ ముందుంచారు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 212 రన్స్ చేశారు. ప్రమాదకరమైన జోడీని విడదీశాడు ఉనాద్కత్. డారిల్ మిచెల్ భారీ షాట్ కొట్టబోయి నితీశ్ కు చిక్కాడు. మిచెల్ తర్వాత మైదానంలోకి వచ్చిన శివం దూబే ఎక్కడా తగ్గలేదు. ఏకంగా 39 రన్స్ చేశాడు. కమిన్స్ ఓవర్ లో దూబే సిక్సర్లు బాదాడు. ఇందులో 1 ఫోర్ 4 సిక్సర్లు ఉన్నాయి.