శతక్కొట్టినా తప్పని ఓటమి
రుతురాజ్ గైక్వాడ్ సూపర్
చెన్నై – చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. లక్నో చేతిలో 6 వికెట్ల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. ఐపీఎల్ 2024లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ ఆద్యంతమూ ఆసక్తికరంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 213 రన్స్ చేసింది. మార్కస్ స్టోయినిస్ దుమ్ము రేపాడు. చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశాడు. ఇక చెన్నై జట్టులో రుతురాజ్ గైక్వాడ్ దుమ్ము రేపాడు. లక్నో బౌలర్లకు చుక్కలు చూపించాడు. మైదానం నలు మూలలా కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు.
రుతురాజ్ తానేమీ తీసిపోనంటూ రెచ్చి పోయాడు. 60 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు 3 సిక్సర్లతో 108 రన్స్ చేశారు. మైదానంలోకి వచ్చిన యువ క్రికెటర్ శివమ్ దూబే శివ మెత్తాడు. 66 రన్స్ తో ఆకట్టుకున్నాడు. కానీ ఎక్కడా తగ్గలేదు. సిక్సర్ల మోత మోగించాడు. కేవలం 27 బంతులు మాత్రమే ఎదుర్కొని 3 ఫోర్లు 7 సిక్సర్లు కొట్టాడు.
రుతురాజ్ శతకం చేసినా జట్టు గెలవలేక పోయింది. అయినా చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. తమ జట్టుకు మద్దతు తెలపడం మాత్రం ఆపలేదు.