సీమాంతర ఉగ్రవాదం ప్రమాదకరం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్
రష్యా – రష్యాలోని కజాన్ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సు 2024 ముగిసింది. ఎవరూ ఊహించని రీతిలో భారత్, చైనా దేశాల మధ్య చారిత్రాత్మకమైన అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించారు. ఈ మేరకు భారత్, చైనా సరిహద్దు వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా సంయమనం పాటించాలని ఓ ఒప్పందానికి వచ్చారు.
ఇది ఊహించని పరిణామం అని చెప్పక తప్పదు. ఈ సందర్బంగా బ్రిక్స్ సదస్సులో కీలకమైన పాత్ర పోషించారు రష్యా దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఆయన భారత్, చైనా దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను తగ్గించేందుకు ప్రయత్నం చేశారు. ఈ మేరకు ఆయన సక్సెస్ అయ్యారు.
పుతిన్ చేసిన ప్రయత్నం ఫలించింది. చైనా దేశాధ్యక్షుడు జిన్ పింగ్, భారత దేశ ప్రధాని మోడీ మధ్య తిరిగి స్నేహం కుదిరింది. మోడీ మాట్లాడుతూ సీమాంతర ఉగ్రవాదం అందరినీ కలవర పరుస్తున్నదని, దీనిపై ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ సందర్బంగా సదస్సుకు హాజరైన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దక్షిణాసియాలో దౌత్య కార్యకలాపాలు ఈ ప్రాంతానికి సంబంధించిన సంక్లిష్టమైన, అనూహ్య భౌగోళిక రాజకీయ దృశ్యాన్ని నొక్కి చెప్పాయని అన్నారు. .
భారతదేశం, పాకిస్తాన్, కెనడా, బంగ్లాదేశ్‌లు ముందంజలో ఉండటంతో, ఈ సంఘటనలు సహకారం, సంఘర్షణల చిత్రణను హైలైట్ చేశాయని పేర్కొన్నారు సుబ్రమణ్యం జై శంకర్.