NEWSNATIONAL

చైనా విష‌యంలో ప‌ట్టించుకోని నెహ్రూ

Share it with your family & friends

నిప్పులు చెరిగిన సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్

న్యూఢిల్లీ – కేంద్ర విదేశీ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చైనా విష‌యంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆనాడు ఉక్కు మ‌నిషిగా పేరు పొందిన స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ చైనా విష‌యంలో ప‌లుమార్లు హెచ్చరిక‌లు చేసినా , జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని చెప్పినా అప్ప‌టి ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ ప‌ట్టించు కోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఓ టీవీ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ఎస్ జై శంక‌ర్ ఈ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. అప్ప‌టి పీఎంగా ఉన్న నెహ్రూ చైనా ప‌ట్ల క‌ఠిన వైఖ‌రి తీసుకోలేక పోయార‌ని అన్నారు. ఉదాసీన వైఖ‌రితో ఉండ‌డం వ‌ల్ల‌నే ఇవాళ అది గుదిబండ‌గా మారింద‌న్నారు జై శంక‌ర్.

చైనా విషయంలో నెహ్రూ అవలంభించిన విదేశాంగ విధానం బుడగతో సమానమన్నారు. ఆయనకు అమెరికా అంటే కోపమని, అందుకే భారత్‌కు చైనా గొప్ప మిత్ర దేశంగా చెప్పేవారని, అప్పట్లో అందరూ దానినే నమ్మినట్లు చెప్పారు. ఇప్పటికీ కొంతమంది ఇదే మాట చెబుతున్నారని ఎద్దేవా చేశారు.

భారత్‌కు స్వేచ్ఛ ల‌భించిన‌ తర్వాత పాకిస్థాన్, చైనా వ్యవహారాలపై అప్పటి మంత్రులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అయినా నెహ్రూ పట్టించు కోలేదని ధ్వ‌జ‌మెత్తారు జై శంక‌ర్.

హిమాలయాల మీదుగా ఆక్రమణకు ప్రయత్నిస్తారని అనుకోవడం లేదని చెప్పారని తెలిపారు. 1950లలో భారత్‌కు అమెరికా దూరం కావడానికి చైనాయే కారణమని ఆరోపించారు. ఈ అంశంపై నాటి న్యాయ శాఖ మంత్రి అంబేడ్కర్ కూడా నెహ్రూను ప్రశ్నించిన విష‌యాన్ని ఈ సంద‌ర్బంగా గుర్తు చేశారు.