విదేశాంగ శాఖ మంత్రిగా జై శంకర్
సుబ్రమణ్యంకే జై కొట్టిన మోడీ
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరింది ఎన్డీయే, బీజేపీ సంకీర్ణ సర్కార్. ఈ సందర్బంగా నరేంద్ర దామోదర దాస్ మోడీ సారథ్యంలో కొత్తగా పదవీ బాధ్యతలు చేపట్టారు 72 మంది మంత్రులు. తమ పార్టీతో పాటు మిత్రపక్షాలకు చెందిన ఎంపీలకు సముచిత స్థానం కల్పించారు నరేంద్ర మోదీ.
పదవుల ఎంపీక , బాధ్యతల వెనుక కీలకంగా వ్యవహరించారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా. ఇదిలా ఉండగా గత ప్రభుత్వంలో పీఎం నరేంద్ర మోడీకి నమ్మకమైన మంత్రిగా గుర్తింపు పొందారు విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. ఆయన భారత దేశ కీర్తి పతాకాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఎగుర వేయడంలో ముఖ్య భూమిక పోషించారు.
కాగా మరోసారి నరేంద్ర మోడీ సుబ్రమణ్యం జై శంకర్ వైపే మొగ్గు చూపారు. ఆయనకు పాత శాఖనే కేటాయించారు. దీంతో మంగళవారం ఎస్ జై శంకర్ భారత దేశ విదేశాంగ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా తనకు బాధ్యత అప్పగించిన పీఎం మోడీకి ధన్యవాదాలు తెలిపారు .