జై శంకర్ కే జై కొట్టిన మోడీ
మరోసారి విదేశాంగ శాఖనే
న్యూఢిల్లీ – సుబ్రమణ్యం జై శంకర్ మరోసారి నరేంద్ర మోడీ కేబినెట్ లోకి వచ్చేశారు. నరేంద్ర మోడీ బృందంలో ఆయన కీలకమైన వ్యక్తిగా ఉన్నారు. భారత దేశానికి విదేశాలలో అద్భుతమైన పేరు తీసుకు వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో తను గెలుపొందడంతో సీట్ కన్ ఫర్మ్ చేశారు ప్రధానమంత్రి.
విదేశాంగ శాఖ మంత్రిగా తను వంద శాతం సక్సెస్ అయ్యాడు. ప్రధానంగా కష్ట సమయాంలో భారత దేశం పరువు పోకుండా కాపాడడంలో తను చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతే కాదు చర్చలు జరపడంలో, సానుకూల దృక్ఫథాన్ని కలిగి ఉండడంలో తనకు తనే సాటి అని నిరూపించుకున్నారు.
ప్రధానంగా మోడీ పరివారంలో, తను ఇష్టపడే వ్యక్తులలో అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తర్వాత సుబ్రమణ్యం జై శంకర్ కావడం విశేషం. తను విద్యావంతుడు. ప్రధానంగా కొన్నేళ్ల పాటు వివిధ హోదాలలో పని చేశారు.
అమెరికా, చైనా లాంటి అగ్ర దేశాలకు చమత్కారమైన సమాధానాలతో చురకలు అంటించడంలో కూడా దిట్టగా పేరు పొందారు. అంతే కాదు పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి , మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మనసు దోచుకున్నారు. భారత విదేశాంగ విధానం సూపర్ అంటూ కితాబు ఇచ్చారు. ఇది ఆయన పనితీరుకు నిదర్శనం.