కెనెడా పీఎంపై జై శంకర్ కన్నెర్ర
రెండు నాల్కల ధోరణి మంచిది కాదు
ఢిల్లీ – భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ నిప్పులు చెరిగారు. భారత్, కెనడా దేశాల మధ్య దౌత్య పరమైన సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కెనడా ప్రధానమంత్రి ట్రూడో తన స్థాయికి తగని రీతిలో వ్యవహరిస్తున్నారని, ప్రధానంగా భారత దేశం పట్ల తన అక్కసునంతా వెళ్లగక్కుతున్నాడని మండిపడ్డారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
కేవలం సిక్కుల ఓటు బ్యాంకు కోసం భారత్ పై నోరు పారేసు కోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు సుబ్రమణ్యం జై శంకర్. భారత ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.
ఇలాగే కెనడా పీఎం నోరు పారేసుకుంటూ పోతే చివరకు తను ఒంటరి కావడం తప్ప ఏమీ కాదన్నారు. ఆయన రెండు నాల్కల ధోరణిని ప్రదర్శించడం మానుకోవాలని హితవు పలికారు కేంద్ర మంత్రి. లేక పోతే చివరకు రాజకీయ పరంగా, దేశీయ పరంగా తనకు చుక్కెదురు కాక తప్పదని స్పష్టం చేశారు సుబ్రమణ్యం జై శంకర్.
ఇకనైనా మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలని సూచించారు ట్రూడో.