DEVOTIONAL

టీటీడీ ప‌ద‌వి ద‌క్క‌డం స్వామి పుణ్య‌మే

Share it with your family & friends

టీటీడీ బోర్డు ఎక్స్ అఫిసియో స‌భ్యుడు

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి (టీటీడీ) బోర్డు ఎక్స్ అఫిసియో స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు ఎస్ . స‌త్య‌నారాయ‌ణ‌. ఆయ‌న‌ను ఏపీ టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం నియ‌మించింది. ఇప్ప‌టికే టీటీడీ బోర్డు చైర్మ‌న్ గా బీఆర్ నాయుడుతో పాటు 24 మంది స‌భ్యులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. వీరితో పాటు ఎక్స్ అఫిసియో స‌భ్యుడిని నియ‌మించారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఎస్. స‌త్య‌నారాయ‌ణ రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌ని చేస్తున్నారు. ఆయ‌న ఎక్స్ అఫిసియో స‌భ్యుడిగా కొన‌సాగుతారు. ఎస్. స‌త్య‌నారాయ‌ణ‌తో టీటీడీ బోర్డు అడిష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ వెంక‌య్య చౌద‌రి ప్ర‌మాణ స్వీకారం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారికంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ఆల‌యంలో కొన‌సాగింది.

ప్ర‌మాణ స్వీకారం చేసిన అనంత‌రం ఎస్. స‌త్య‌నారాయ‌ణ త‌న కుటుంబీకుల‌తో క‌లిసి స్వామి వారిని ద‌ర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్ర పటాన్ని అడిషనల్ ఈవో అందించారు ఎస్. స‌త్య‌నారాయ‌ణ‌కు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డిప్యూటీ ఈవో లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.