బాధితులకు అండగా ఉంటాం – సబితా రెడ్డి
ఆక్రందనలు వినిపించనట్టు నటిస్తున్న సీఎం
హైదరాబాద్ – మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నాడని, పేదలు, సామాన్యుల ఇళ్లను కూల్చడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రోమ్ నగరం తగల బడుతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు.. ఇంత మంది ఆక్రందనలు, ఏడుపులు వినిపించనట్లు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సబితా ఇంద్రారెడ్డి.
ఎవరూ కూడా అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ఆదివారం మూసీ పరివాహక ప్రాంతాలలో ఉన్న వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుతో కలిసి సబితా ఇంద్రారెడ్డి.
ఇది మంచి పద్దతి కాదని సీఎంకు హితవు పలికారు. మీరంతా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. బాధితులకు న్యాయ పరంగా అండగా ఉంటామని హామమీ ఇచ్చారు. ఏ సమయంలోనైనా న్యాయ సహాయం అందించేందుకు బీఆర్ఎస్ లీగల్ టీమ్ 24 గంటల పాటు తెలంగాణ భవన్ లో సేవలు అందిస్తుందన్నారు సబితా ఇంద్రారెడ్డి.