NEWSTELANGANA

కాంగ్రెస్ నేత‌ల తీరుపై స‌బిత నిర‌స‌న

Share it with your family & friends

తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి

హైద‌రాబాద్ – రాజ‌కీయాల‌లో ఎవ‌రు ఎప్పుడు వెలుగులోకి వ‌స్తారో తెలియ‌దు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చింది. కాంగ్రెస్ ఊపులో సైతం మాజీ మంత్రి స‌బితా ఇంద్రా రెడ్డి అనూహ్యంగా త‌న స‌త్తా చాటారు. ఎమ్మెల్యేగా తిరిగి గెలుపొందారు. ఆమె నిత్యం ప్ర‌జ‌ల్లో ఉంటూ వ‌చ్చారు.

తాజాగా అనుకోని ఘ‌ట‌న చోటు చేసుకుంది. సోమ‌వారం ఎమ్మెల్యే ఓ స‌మావేశంలో తన‌కు స‌రైన ప్రాధాన్య‌త ఇవ్వ‌డం లేదంటూ మండిప‌డ్డారు. నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ కింద‌నే కూర్చున్నారు. ప్ర‌భుత్వ అధికారిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొనకుండా అడ్డుకున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు.

దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు స‌బితా ఇంద్రారెడ్డి. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. రాజ‌కీయాల‌లో ఎవ‌రూ శాశ్వ‌తం కాద‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. తాము అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ ఏనాడూ ఇలా వ్య‌వ‌హ‌రించ లేదంటూ మండిప‌డ్డారు.

అధికారం శాశ్వ‌తం కాద‌ని, ప్ర‌జ‌లే శాశ్వ‌త‌మ‌ని , త‌న‌ను ప్ర‌జ‌లు కావాల‌ని ఎమ్మెల్యేగా గెలిపించు కున్నార‌ని ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు స‌బితా ఇంద్రారెడ్డి.