పోలీసుల త్యాగం చిరస్మరణీయం – సీఎం
పోలీసుల సంస్మరణ దినోత్సవంలో బాబు
విజయవాడ – వృత్తి పరంగా మెరుగైన సమాజం కోసం బలిదానం, త్యాగం చేసిన అమరులైన పోలీసు వీరులకు సలాం చేస్తున్నానని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. సోమవారం విజయవాడలో పోలీసు సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని పరేడ్ చేపట్టారు. ఈ సందర్బంగా సీఎం గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ఏపీ హోం , విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనితతో పాటు డీజీపీ ద్వారకా తిరుమల రావు హాజరయ్యారు. సురక్షితమైన సమాజం కోసం నేరాలకు వ్యతిరేకంగా పోరాటంలో తమ ప్రాణాలను అర్పించిన వీర పోలీసు సిబ్బందికి నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు సీఎం.
పోలీసులు చూపిన ధైర్యం, అంకితభావం, త్యాగం ఎప్పటికీ గుర్తుండి పోతాయని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. నేరాలు చేసే వారు ఎవరైనా సరే కఠినంగా శిక్షించాల్సిందేనని అన్నారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల వ్యవస్థ అత్యంత కీలకమైనదని, వారి సంక్షేమమే తమ ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
శాంతి భద్రతలు కాపాడటంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు . రాష్ట్ర విభజన తరువాత పోలీసు వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చాని అన్నారు సీఎం.