సద్దురు ఆరోగ్యం పదిలం
మెదడుకు సర్జరీ చేసిన వైద్యులు
న్యూఢిల్లీ – ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త , ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసు దేవన్ ఉన్నట్టుండి తీవ్ర అనారోగ్యానికి లోనయ్యారు. తీవ్రమైన తలనొప్పి రావడంతో ఆస్పత్రిలో చేరారు. తీరా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన తలలో ఒక భాగం గడ్డకట్టుకుని ఉందని , ఆపరేషన్ చేయాల్సి ఉందని అపోలో వైద్యులు తెలిపారు. లేకపోతే ప్రాణానికి ప్రమాదం ఏర్పడనుందని హెచ్చరించారు.
దీంతో శస్త్ర చికిత్స చేయించు కునేందుకు సద్గురు జగ్గీ వాసుదేవన్ ఒప్పుకున్నారు. మార్చి 17న సద్గురును ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
మొదట జగ్గీ వాసుదేవన్ కు మెదడులో రక్త స్రావం అధికం కావడంతో హుటా హుటిన ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందని ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ఆయనను వెంటిలేటర్ నుంచి కిందకు దించారు. ఇదిలా ఉండగా సద్దురు త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు.