సాగరికా జోష్ కు బంపర్ ఆఫర్
నామినేట్ చేసిన టీఎంసీ
పశ్చిమ బెంగాల్ – పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్య సభ ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరపున ఇద్దరికి ఛాన్స్ ఇచ్చారు. జర్నలిస్ట్ రంగంలో కీలకమైన వ్యక్తిగా పేరు పొందిన సాగరికా ఘోష్ తో పాటు సుష్మితా దేవ్ కు రాజ్యసభ కు నామినేట్ చేశారు సీఎం.
2021లో పశ్చిమ బెంగాల్ విధాన సభ ఎన్నికల్లో సాగరిక ఘోష్ మమతా బెనర్జీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అంతే కాదు దీదీని ఆకాశానికి ఎత్తేశారు. అభిరుచి, పట్టుదలతో పోరాడే నాయకురాలంటూ కితాబు ఇచ్చారు.
ఇదిలా ఉండగా టీఎంసీ రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి నలుగురిని నామినేట్ చేసింది. వీరిలో సాగరికా ఘోష్ , సుష్మితా దేవ్, మహ్మద్ నదిముల్ హక్ , మమతా బాలా ఠాకూర్ లను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం ప్రకటించింది. ఈమేరకు అధికారికంగా టీఎంసీ వెల్లడించింది వీరి పేర్లను.
తృణమూల్ పార్టీ శాశ్వతమైన స్ఫూర్తిని, ప్రతి భారతీయుడి హక్కుల కోసం వాదించే వారసత్వాన్ని నిలబెట్టడానికి కృషి చేయాలి అని పేర్కొంది.