ENTERTAINMENT

భార‌త దేశ‌పు వ‌జ్రం ర‌త‌న్ టాటా

Share it with your family & friends

న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ దిగ్భ్రాంతి

హైద‌రాబాద్ – భార‌త దేశ దిగ్గ‌జ వ్యాపార వేత్త ర‌త‌న్ టాటా మ‌ర‌ణం ప‌ట్ల తీవ్ర విచారం వ్య‌క్తం చేశారు ప్ర‌ముఖ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్. గురువారం ఎక్స్ వేదిక‌గా తీవ్ర సంతాపం తెలిపారు. ఆయ‌న లేర‌న్న వార్త‌ను జీర్ణించు కోలేక పోతున్నాన‌ని అన్నారు.

టైటాన్ అనేది భార‌త దేశానికి ఓ చిహ్నంగా మార్చేసిన ఘ‌న‌త ర‌త‌న్ టాటాకే ద‌క్కుతుంద‌న్నారు. ఏ వ్యాపారం చేసినా దానికి విలువ‌లు అనేవి ఉండాల‌ని చెప్పిన , ఆచ‌రించి చూపించిన మ‌హానుభావుడు ర‌త‌న్ టాటా అని కొనియాడారు సాయి ధ‌ర‌మ్ తేజ్.

ర‌త‌న్ టాటా ప్ర‌భావం త‌న‌పై ఎంత‌గానో ఉంద‌న్నారు. ఆయ‌న నుంచి తాను చాలా నేర్చుకున్నాన‌ని తెలిపారు. చ‌రిత్ర ఉన్నంత వ‌ర‌కు, లోకం ఉన్నంత వ‌ర‌కు ర‌త‌న్ టాటా బ‌తికే ఉంటార‌ని స్ప‌ష్టం చేశారు సాయి ధ‌ర‌మ్ తేజ్.
..
మీ విజ్ఞతతో కూడిన పదాలు నన్ను ప్రేరేపించాయి, లోతుగా తాకాయి. మీ వినయం, దయతో మమ్మల్ని ప్రేరేపించినందుకు ధన్యవాదాలు . మీరు ఎక్క‌డ ఉన్నా ప్ర‌శాంతంగా ఉండాల‌ని ఆ దేవుడిని కోరుకుంటున్నాన‌ని అన్నారు.