Thursday, April 3, 2025
HomeENTERTAINMENTసైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్

సైఫ్ అలీ ఖాన్ కేసులో నిందితుడు అరెస్ట్

ద‌ర్శిలో రైల్వే పోలీసుల అదుపులోకి

ముంబై – దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో ప్ర‌ధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ లో గుర్తించారు. జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో నిందితుడు ప్రయాణిస్తుండగా, వీడియో కాల్ ద్వారా ధ్రువీకరించుకుని రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సైఫ్ ఆరోగ్యం నిల‌క‌డగానే ఉంద‌ని తెలిపారు వైద్యులు.

ఇదిలా ఉండ‌గా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జ‌రిగిన ఘటనలో తాజాగా మ‌రో వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఘటన అనంతరం ఉదయం 9 గంటల సమయంలో ఓ దుకాణంలో హెడ్‌ఫోన్స్ కొనుగోలు చేసిన‌ట్లు ఫుటేజ్ లో వెల్ల‌డైంది.

మ‌రో వైపు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉన్న సైఫ్ అలీ ఖాన్ ను ఇవాళ స్పెష‌ల్ రూమ్ లోకి మారుస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రెండు లేదా మూడు రోజుల్లో బాలీవుడ్ న‌టుడిని డిశ్చార్జ్ చేస్తామ‌న్నారు వైద్య బృందం. కాగా సైఫ్ దాడి వెనుక ముంబై అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా ప్ర‌మేయం ఉందంటూ జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని కొట్టి పారేసింది మ‌రాఠా స‌ర్కార్.

RELATED ARTICLES

Most Popular

Recent Comments