Saturday, April 19, 2025
HomeENTERTAINMENTసైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్

సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్

నిందితుడిని అరెస్ట్ చేయ‌లేదు

ముంబై – బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీసీ టీవీ ఫుటేజ్ ప‌రిశీలించామ‌ని, దాడి చేసిన వ్య‌క్తిని ఇంకా అరెస్ట్ చేయ‌లేద‌న్నారు ముంబై పోలీసులు. అరెస్ట్ చేశారంటూ వ‌చ్చిన వార్త‌ల‌న్నీ పూర్తిగా అబ‌ద్ద‌మ‌ని కొట్టి పారేశారు. అనుమానితుడిని బాంద్రా పోలీస్ స్టేష‌న్ లో విచారించ‌డం జ‌రిగింద‌ని, విచార‌ణ కొన‌సాగుతోంద‌ని స్ప‌ష్టం చేశారు ముంబై పోలీస్ జోన్ -9 డీసీపీ దీక్షిత్ బెగెడ్.

ఇదిలా ఉండ‌గా సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం గురించి అప్ డేట్ ఇచ్చారు లీలావ‌తి ఆస్ప‌త్రి యాజ‌మాన్యం. ప్ర‌స్తుతానికి ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌న్నారు. దుండ‌గుడి దాడిలో సైఫ్ శ‌రీరంపై ఆరు చోట్ల క‌త్తిపోట్లు గురైన‌ట్లు వెల్ల‌డించారు.

ప్ర‌స్తుతానికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ) లో చికిత్స కొన‌సాగుతోంద‌ని ఇవాళ స్పెష‌ల్ రూమ్ లోకి మార్చేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని తెలిపారు. ప్ర‌స్తుతానికి సైఫ్ ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని , ఆయ‌న‌ను డిశ్చార్జ్ చేసేందుకు ఇంకా మూడు రోజుల స‌మ‌యం ప‌ట్ట‌వ‌చ్చ‌న్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments