ప్రాణాపాయం తప్పినట్లేనన్న నటి
ముంబై – గురువారం అర్ధరాత్రి తన ఫ్లాట్ లో నివసిస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై గుర్తు తెలియని ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. ఆయన శరీరంపై ఆరు చోట్ల కత్తిపోట్లు అయ్యాయి. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా తన కుటుంబంతో కలిసి సైఫ్ అలీ ఖాన్ స్విట్జర్లాండ్ వెళ్లి ముంబైకి విచ్చేశారు.
ఈ సమయంలో తన భార్య ప్రముఖ నటి కరీనా కపూర్ , ఇద్దరు పిల్లలతో కలిసి నిద్రిస్తున్న సమయంలో ఉన్నట్టుండి చోరీ కోసం ఇంట్లోకి ప్రవేశించాడు దుండగుడు. విషయం పసిగట్టిన సైఫ్ అలీ ఖాన్ అతడిని ప్రతిఘటించే ప్రయత్నం చేశాడు. కానీ పరిస్థితి చేయి దాటి పోవడంతో ఉన్నట్టుండి ఆగంతకుడు నటుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో కరీనా, పిల్లలు కేకలు వేయడంతో ఒక్కసారిగా తప్పించుకుని పారి పోయాడు ఆగంతకుడు. రక్త స్రావం కావడంతో హుటా హుటిన సైఫ్ ను లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు భార్య కరీనా కపూర్. అభిమానుల ప్రార్థనలు ఫలించాయని , ప్రస్తుతం బాగానే ఉందన్నారు.