ఆపరేషన్ మొదలు పెట్టిన భారత సైన్యం
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడి వెనుక ప్రధాన సూత్రధారి ఎవరు అనే దానిపై ఆరా తీసింది భారత ఆర్మీ. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆయన కాశ్మీర్ లోనే మకాం వేశారు. ఈ మొత్తం ప్లాన్ ను రూపొందించింది సైఫుల్లా కసూరి అలియాస్ ఖలీద్ అని గుర్తించింది. తనకు లగ్జరీ కార్లంటే ఇష్టం. పాకిస్తాన్ సైన్యం తనను ఎక్కువగా ఆదరిస్తుంది. బైసర్ లోయలో జరిగిన ఘటనలో 27 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ దాడి యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.
ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ప్రకటించింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్). ఇది పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందింది. జమ్మూ కాశ్మీర్‌లో లష్కర్ , టిఆర్‌ఎఫ్ ఉగ్రవాద కార్యకలాపాల వెనుక ఉగ్రవాది సైఫుల్లా ఖలీద్ ప్రధాన సూత్రధారి అని నిఘా వర్ఘాలు వెల్లడించాయి.
లష్కర్-ఎ-తోయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా ఖలీద్‌ను సైఫుల్లా కసూరి అని కూడా పిలుస్తారు. అతను భారతదేశ అతిపెద్ద శత్రువు హఫీజ్ సయీద్‌కు చాలా దగ్గరివాడు. పాకిస్తాన్ సైన్యంలోని సైనికులను ప్రేరేపించడానికి అతను పనిచేస్తున్నాడని గుర్తించారు.
తాజా నివేదికల ప్రకారం ఉగ్రవాద దాడికి 2 నెలల ముందు సైఫుల్లా కసూరి పాకిస్తాన్ లోని పంజాబ్ కంగన్ పూర్ కు చేరుకున్నాడు. అక్కడ పాక్ కు చెందిన సైనిక బెటాలియన్ ఉంది. జిహాదీ ప్రసంగం ఇచ్చేందుకు పిలిపించారని వెల్లడైంది. తను పాకిస్తాన్ సైన్యాన్ని భారత దేశంపైకి రెచ్చగొట్టేలా చేశాడు.
అంతే కాదు ఖైబర్ పఖ్తుంఖ్వాలో జరిగిన సమావేశంలో ఇండియాపై విషం చిమ్మాడు. 2026 ఫిబ్రవరి 2 నాటికి కాశ్మీర్ ను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించాడు.