సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా
ప్రభుత్వ సలహాదారు పదవికి గుడ్ బై
అమరావతి – ఏపీ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ లో నెంబర్ 2గా పేరు పొందిన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి అత్యంత అవమానకరమైన రీతిలో వెనుదిరిగారు. ఆయన ఏపీ సర్కార్ ను ఒక రకంగా శాసించారు. అన్నీ తానై వ్యవహరించారు. ఏ పని కావాలన్నా, సీఎంను ఎప్పుడు కలవాలన్నా ముందు తనను కలవాల్సిందే.
ప్రభుత్వ సలహాదారుగా ఆయనను ఏరికోరి నియమించారు జగన్ మోహన్ రెడ్డి. ఏపీ వైసీపీ సర్కార్ కు అన్నీ కళ్లు సజ్జల రామకృష్ణా రెడ్డే వ్యవహరించారు. చివరకు ఏపీ ప్రజలు చెంప ఛెళ్లుమనిపించేలా తీర్పు ఇచ్చారు. ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు.
ఊహించని రీతిలో వైసీపీకి కోలుకోలేని షాక్ ఇవ్వడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణా రెడ్డి రాజీనామా చేశారు. ఆయనతో పాటు జగన్ రెడ్డి సర్కార్ లో ఏకంగా 20 మంది ప్రభుత్వ సలహాదారులు తమ పదవులకు గుడ్ బై చెప్పారు.