స్కామ్ లలో కింగ్ చంద్రబాబు
సజ్జల రామకృష్ణా రెడ్డి కామెంట్స్
తాడేపల్లి గూడెం – వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. జాతీయ, అంతర్జాతీయ స్కామ్ లలో కింగ్ బాబు అంటూ ఎద్దేవా చేశారు. ఆయనకు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని మింగేస్తాడని హెచ్చరించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
20 ఏళ్ల కిందట ఐఎంజీ భారత్ తరహాలోనే మొన్నటి స్కిల్, అమరావతి తదితర స్కామ్ లంటూ ఎద్దేవా చేశారు. అన్ని కేసుల్లోనూ బాబుది ఒకే పద్దతిని అనుసరించాడంటూ మండిపడ్డారు. బడా బాబులకు కట్టబెట్టడంలో దిట్ట అంటూ ఫైర్ అయ్యారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
ప్రస్తుతం టీడీపీ వెంటిలేటర్ పై ఉందని, దానిని గట్టెక్కించేందుకు నానా తంటాలు పడుతున్నాడని అన్నారు. ఆఖరికి గడ్డిపూచ దొరికినా ఒడ్డుకు చేరాలని తాపత్రయ పడుతున్నాడని ఫైర్ అయ్యారు . బాబు సలహా మేరకు దివాళా తీసిన పార్టీని షర్మిలా రెడ్డి అద్దెకు తీసుకుందంటూ సంచలన ఆరోపణలు చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి.
చంద్రబాబు 20 ఏళ్ల క్రితం చేసిన మహా దోపిడీపై ఐఎంజీ భారత్ వేసిన పిటీషన్‌ను కొట్టి వేసిందని గుర్తు చేశారు. నేరస్థులకు, అక్రమార్కులకు చంద్రబాబు నాయకుడంటూ ఎద్దేవా చేశారు. మార్కెట్ లో ఎకరం భూమి రూ. 2 కోట్లు పలికితే మనోడు కేవలం రూ.50 వేలకే 800 ఎకరాలను ధారదత్తం చేశాడని ధ్వజమెత్తారు. 20 ఏళ్ల కిందంటే లక్ష కోట్లు కొల్లగొట్టేందుకు స్కెచ్ వేసిన గజ దొంగ బాబు అంటూ మండిపడ్డారు.