NEWSANDHRA PRADESH

ఏపీలో మ‌న‌దే రాజ్యం – స‌జ్జ‌ల

Share it with your family & friends

పోలింగ్ సంద‌ర్బంగా జాగ్ర‌త్త
అమ‌రావ‌తి – వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , రాష్ట్ర ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జూన్ 4న పోలింగ్ ఫ‌లితాలు రానున్నాయి. ఈ సంద‌ర్బంగా వైసీపీ తిరిగి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు.

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రెండోసారి ఏపీకి ముఖ్య‌మంత్రిగా కాబోతున్నార‌ని జోష్యం చెప్పారు. అయితే ఎన్నికల కమిషన్ రూల్స్ ప్రకారం కౌంటింగ్ సమయంలో జాగ్రత్తగా ఉండాలని వైసీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లకు సూచించారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

అయితే ప్రత్యర్థి పార్టీ ఏజెంట్లతో అప్రమత్తంగా వ్యవహరించాలని స్ప‌ష్టం చేశారు. అవతల పార్టీ ఆటలు సాగనివ్వద్దని అన్నారు. మనం అధికారంలోకి వస్తున్నామ‌ని చెప్పారు. జూన్ 9వ తేదీ ఉద‌యం 9.18 గంట‌ల‌కు ముహూర్తం కూడా ఖ‌రారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు.

ఆరు నూరైనా స‌రే త‌మ‌కు ఆశించిన దాని కంటే ఎక్కువ సీట్లు ద‌క్కుతాయ‌ని అన్నారు. టీడీపీ కూట‌మికి మ‌రోసారి భంగ‌పాటు త‌ప్ప‌ద‌న్నారు.