NEWSANDHRA PRADESH

బాబు కూట‌మి బ‌క్వాస్ – సజ్జ‌ల‌

Share it with your family & friends

ప‌రాజ‌యం ద‌క్క‌డం ఖాయం

అమ‌రావ‌తి – వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ కూట‌మికి ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు. అబ‌ద్దాలకు కేరాఫ్ చంద్ర‌బాబు అన్న‌ది అంద‌రికీ తెలుసన్నారు. వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేయ‌డంలో బాబును మించిన నాయ‌కుడు ఈ దేశంలోనే లేడ‌ర‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాలేద‌ని ఎంచ‌క్కా జాతీయ మీడియా వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డి నుంచి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో జ‌నాన్ని ప‌రేషాన్ చేయ‌డం ఆయ‌న‌కే చెల్లిందంటూ సెటైర్ వేశారు. దేశంలో ఎక్క‌డా లేని రీతిలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌నత ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికే ద‌క్కింద‌న్నారు స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి.

స‌ర్వేలు, సంస్థ‌లు ఇచ్చిన ఫేక్ ఫ‌లితాల‌ను చూసి జ‌నం ఫ‌క్కున న‌వ్వుకుంటున్నార‌ని అన్నారు. ఏపీ సీఎం గా మ‌రోసారి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కొలువు తీరడం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. మొత్తంగా టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి బ‌క్వాస్ అని ఎద్దేవా చేశారు.