లడ్డూ వివాదం చంద్రబాబు రాజకీయం
వైసీపీ మాజీ ప్రభుత్వ సలహాదారు సజ్జల
హైదరాబాద్ – వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. తిరుపతి లడ్డూ కల్తీ ప్రసాదం వివాదం జరిగిందంటూ ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి కామెంట్స్ చేయడం దారుణమన్నారు.
ఆదివారం సజ్జల రామకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో చంద్రబాబు తప్పు చేశాడని అన్నారు. పూర్తిగా ఆయన చెప్పినవన్నీ అబద్దాలేనని ఏకి పారేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
యానిమల్ ఫ్యాట్ ఉందన్న విషయానికి సంబంధించి నెయ్యిని సరఫరా చేసే కంపెనీకి టీటీడీ ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఎందుకు లేదని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. తిరుమల పేరుతో రాజకీయం చేయాలని చూడడం చంద్రబాబుకు తగదన్నారు.
ఇదే సమయంలో వైసీపీని, జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా డ్యామేజ్ చేయడంలో భాగంగానే తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని తెర పైకి పనిగట్టుకుని తీసుకు వచ్చారంటూ ఆరోపించారు సజ్జల రామకృష్ణా రెడ్డి. తాము బాజాప్తాగా కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశామని కానీ సీఎం మాత్రం సిట్ ఏర్పాటు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.