గర్భవతి గానే నాదా హఫీజ్ పోటీకి సై
ప్రపంచ వ్యాప్తంగా ఫెన్సర్ వైరల్
యావత్ ప్రపంచం తనను చూసి విస్తు పోయింది. అంతకు మించి ఆశ్చర్యానికి లోనైంది. ఎవరీ నాదా హఫీజ్. కరుడు గట్టిన కఠిన నియమ, నిబంధనలు పాటించే ఈజిప్టు దేశానికి చెందిన ఆమె ఇప్పుడు వరల్డ్ వైడ్ గా చర్చనీయాంశంగా మారింది. ఎవరైనా మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు బరువు పనులు చేసేందుకు కుటుంబం ఒప్పుకోదు. కానీ తనకు క్రీడలంటే ప్రాణం. అంతకు మించి భర్త అంటే కూడా. తనను నిరంతరం ప్రోత్సహిస్తూ వచ్చిన తనంటే గౌరవం కూడా. ఇవాళ ఆమెను చూసి మహిళా లోకం గర్వ పడుతోంది. జీవితంలో పైకి ఎదగాలన్నా, ప్రత్యేకంగా కనిపించాలన్నా మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలని అంటోంది నాదా హఫీజ్.
తను ఎలాగైనా సరే పతకాన్ని గెలవాలని అనుకుంది. తను ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. నిరంతరం ఆట మీదే ధ్వాస. ఓ వైపు కుటుంబ పరంగా భర్తకు చేదోడుగా ఉంటూనే తనను తాను ఫెన్సర్ గా ప్రూవ్ చేసుకునే పనిలో పడింది నాదా హఫీజ్. ఎవరైనా నడవాలంటే కష్ట పడతారు. కానీ తను ఏడు నెలల నిండు గర్భిణీ. కానీ తను దేశం తరపున ఆడాలని కలలు కన్నది. తను ప్రేమించి, ఆరాధించే జాతీయ జెండా రెప రెపలాడేలా చేయాలని ప్రయత్నం చేసింది. అంతే కాదు పతకం సాధిస్తే తనకంటే దేశం యావత్తు గర్విస్తుందని భావించింది.
ఓ వైపు ఆరోగ్య పరంగా భర్త, వైద్యులు, కుటుంబీకులు సూచించినా , వద్దని చెప్పినా వినిపించు కోలేదు. తన దేశం కంటే తను గొప్ప వ్యక్తిని కానని ప్రకటించింది నాదా హఫీజ్. పట్టుదలతో ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్ పోటీలలో ఫెన్సర్ గా పాల్గొంది. ఫెన్సింగ్ ఉమెన్స్ సాబెర్ ఇండివిజువల్ టేబుల్ ఆఫ్ 32లో అమెరికాకు చెందిన ఎలిజబెత్ టార్టకోవెస్కీని ఓడించింది. అందరినీ విస్తు పోయేలా చేసింది. జీవితంలో ఎదగాలంటే పోరాడాల్సిందేనని, తను నిరంతరం బిడ్డతో శారీరకంగా యుద్దం చేస్తూనే ఉన్నానని స్పష్టం చేసింది నాదా హఫీజ్.