NEWSNATIONAL

యూపీలో స‌త్తా చాటిన ఎస్పీ

Share it with your family & friends

దుమ్ము రేపిన అఖిలేష్ యాద‌వ్

ఉత్త‌ర ప్ర‌దేశ్ – లోక్ స‌భ ఎన్నిక‌ల్లో స‌త్తా చాటింది స‌మాజ్ వాది పార్టీ. ప్ర‌ధానంగా నిన్న‌టి దాకా ఆధిప‌త్యం చెలాయిస్తూ వ‌చ్చిన సీఎం యోగికి బిగ్ షాక్ ఇచ్చింది. ఎస్పీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు. ఈసారి జ‌రిగిన ఎన్నిక‌లు యుద్ద వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పింప చేశాయి. దేశ వ్యాప్తంగా మోడీ గాలి వీస్తోంద‌ని ఢంకా భ‌జాయించి ఊద‌ర‌గొట్టినా త‌ట్టుకుని నిల‌బ‌డేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు అఖిలేష్ యాద‌వ్.

ప్ర‌తిప‌క్షాల‌తో కూడిన భార‌త కూట‌మికి అత్య‌ధిక సీట్లు రావ‌డం విశేషం. అంతే కాదు నిన్న‌టి దాకా రామ జ‌పం చేస్తూ, రామ మందిరాన్ని బూచిగా చూపించి ఓట్లు దండుకోవాల‌ని అనుకున్న భార‌తీయ జ‌న‌తా పార్టీకి అయోధ్య లోనే ఓట‌మి పొందేలా చేయ‌డంలో మ‌గాడిన‌ని అనిపించుకున్నాడు ఎస్పీ చీఫ్‌. ఒక ర‌కంగా మోడీకి, షాకు, బీజేపీకి చెంప పెట్టు లాంటిది ఈ తీర్పు. ఈ ఫ‌లితాలు వారికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా చేశాయి.

అధికారం ఉంది క‌దా అని విర్ర‌వీగుతూ వ‌చ్చిన బీజేపీ స‌ర్కార్ కు జ‌నం షాక్ ఇచ్చారు. కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టారు. ఒక్క యూపీలో ఎస్పీకి ఏకంగా 38 సీట్లు క‌ట్ట‌బెట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ 6 సీట్ల‌తో స‌రి పెట్టుకుంది. మొత్తంగా బీజేపీ బోల్తా ప‌డింది.