సమంత బేబీ బంప్ ఫోటోస్ కేక
నెట్టింట్లో స్టార్ హీరోయిన్ వైరల్
హైదరాబాద్ – ప్రముఖ నటి సమంత రుతు ప్రభు సంచలనంగా మారారు. తాజాగా నెట్టింట్లో తను పోస్ట్ చేసిన బేబీ బంప్ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. నాగ చైతన్యతో విడి పోయాక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిత్యం వార్తల్లో ఉంటోంది.
సోషల్ మీడియాలో తరచూ తన అభిప్రాయాలను పంచుకుంటోంది. ఇటీవలే మాతృత్వపు కోరికను కూడా వెల్లడించింది. తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోలను సమంత స్వయంగా పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో షేక్ చేస్తున్నాయి. అయితే టెక్నాజీలో ఇటీవల చోటు చేసుకున్న మార్పు ఏఐతో చేసిన ఫోటోస్ అంటూ ముద్దుగుమ్మ తెలిపింది.
ఏం మాయ చేశావే సినిమాతో ఈ చిన్నది సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వాసుదేవ మీనన్ దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ మ్యాజిక్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ , బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా నటించింది..మెప్పించింది సమంత రుతు ప్రభు.
అతి కొద్ది కాలంలోనే స్టార్ డమ్ స్వంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పుష్ప-1 చిత్రంలో ఊ అంటావా అనే పాటతో ఊపేసింది. మొత్తంగా బేబీ బంప్ ఫోటోలు మాత్రం కెవ్వు కేక అనేలా ఉన్నాయంటున్నారు ఫ్యాన్స్.