రాహుల్ కామెంట్స్ సంబిత్ సీరియస్
ఎవరు హిందువో దేశానికి తెలుసు
న్యూఢిల్లీ – భారతీయ జనతా పార్టీ ఎంపీ సంబిత్ పాత్ర సీరియస్ అయ్యారు. ఆయన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. ఇవాళ పార్లమెంట్ లో జై పాలస్తీనా నినాదాన్ని లేవనెత్తారు. రేపు లోక్ సభలో జై పాకిస్తాన్ నినాదాన్ని లేవనెత్తే ఛాన్స్ లేక పోలేదన్నారు.
దీనిని తాము ఒప్పుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు సంబిత్ పాత్ర. రాహుల్ గాంధీ ఇంకా పరిణతి చెందాల్సిన అవసరం ఉందన్నారు సంబిత్ పాత్ర. పదే పదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని విమర్శించడం వల్ల తాను గొప్ప నాయకుడినని ఫీల్ అవుతున్నారంటూ ఎద్దేవా చేశారు.
విచిత్రం ఏమిటంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ముచ్చటగా మూడోసారి కొలువు తీరడం గాంధీ కుటుంబానికి నచ్చడం లేదన్నారు. దేశంలోని ప్రతి హిందువుకు ప్రధాని ప్రతినిధి అంటూ స్పష్టం చేశారు సంబిత్ పాత్ర. ఇకనైనా ముందు వెనుకా ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు . లేక పోతే ప్రజలు ఛీ కొట్టడం ఖాయమన్నారు సంబిత్ పాత్ర.