NEWSNATIONAL

రేవంత్ రెడ్డి..అదానీ బంధం సంగ‌తేంటి..?

Share it with your family & friends

బీజేపీ సీనియ‌ర్ నేత సంబిత్ పాత్ర కామెంట్

ఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ స్పోక్స్ ప‌ర్స‌న్ సంబిత్ పాత్ర సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అదానీని అరెస్ట్ చేయాల‌ని, కావాల‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అడ్డుకుంటున్నారంటూ ఆరోప‌ణ‌లు చేసిన రాయ్ బ‌రేలీ ఎంపీ రాహుల్ గాంధీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము అరెస్ట్ చేస్తామో లేదా త‌ర్వాత సంగ‌తి కానీ..
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డికి గౌత‌మ్ అదానీకి మ‌ధ్య ఉన్న సంబంధం ఏమిటో ప్ర‌జ‌ల‌కు చెప్పాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌ని అన్నారు.

గురువారం సంబిత్ పాత్రా మీడియాతో మాట్లాడారు. స్కిల్ యూనివ‌ర్శిటీకి రూ. 100 కోట్లు ఎలా ఎందుకు ఇచ్చారో చెప్పాల‌న్నారు. అంతే కాకుండా ఆయ‌న‌కు సిమెంట్ కంపెనీ ఏర్పాటుకు ఏ ర‌క‌మైన ఒప్పందం చేసుకున్నోరా కూడా వివ‌రిస్తే బాగుంటుంద‌ని ఎద్దేవా చేశారు.

సీఎం ఎలా వంద కోట్లు తీసుకున్నాడో చెప్ప‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు సంబిత్ పాత్రా. అదానీ వంటి కళంకిత సమ్మేళన సంస్థపై తన సీఎం ప్రేమ గురించి రాహుల్ గాంధీ దేశానికి చాలా సమాధానం చెప్పి తీరాలని డిమాండ్ చేశారు

రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చ‌ర్య‌లు తీసుకుంటారా లేక అదానీపై మౌనంగా ఉంటారా అన్న‌ది మీరే తేల్చాల‌ని అన్నారు.