డిప్యూటీ సీఎంగా సామ్రాట్ ప్రమాణం
మిన్నంటిన జై శ్రీరామ్ నినాదాలు
బీహార్ – అనూహ్యంగా బీహార్ లో బీజేపీ, జేడీఎస్ సంకీర్ణ సర్కార్ కొలువు తీరింది. కాంగ్రెస్ పార్టీతో సీఎం నితీశ్ కుమార్ కటీఫ్ చెప్పారు. ఇండియా కూటమికి గుడ్ బై చెప్పి మరోసారి బీజేపీ పంచన చేరారు. నిన్నటి దాకా మోదీని, ఆయన పరివారాన్ని తూర్పార బడుతూ వచ్చిన నితీశ్ ఉన్నట్టుండి జంప్ అయ్యారు. ఆయన కొట్టిన దెబ్బకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, సొనియా గాంధీ, రాహుల్ ,ప్రియాంక గాంధీలు విస్తు పోయారు.
ఇదే సమయంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ సైతం దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో ఆదివారం మరోసారి కొత్త సర్కార్ కొలువు తీరింది బీహార్ లో. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా 9వ సారి ఆయన సీఎం కావడం.
ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీకి చెందిన స్ట్రాంగ్ లీడర్ గా పేరు పొందిన సామ్రాట్ చౌదరి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన స్టేజీ మీదకు రాగానే ప్రాంగణమంతా జై శ్రీరామ్ పేరుతో నినాదాలు మిన్నంటాయి. రాబోయే ఎన్నికల నాటికి సామ్రాట్ బీజేపీ తరపున సీఎం అభ్యర్థిగా ఉన్నారు.