సంధ్య థియేటర్ ఓనర్స్ వెల్లడి
హైదరాబాద్ – తమకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయని స్పష్టం చేశారు సంధ్య థియేటర్ ఓనర్లు. అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 మూవీ ప్రీమియర్ షో సందర్బంగా జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు ఆరు పేజీల లేఖను న్యాయవాదుల ద్వారా పోలీసులకు అందజేశారు. గత 45 సంవత్సరాల కాలంలో ఎన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదన్నారు. 4,5 తేదీలలో మైత్రీ మూవీ మేకర్స్ ఎంగేజ్ చేసుకుందన్నారు.
ఇదిలా ఉండగా సంధ్య థియేటర్ ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో మొత్తం 18 మందిని నిందితులుగా చేర్చారు. వీరిలో ఏ11గా ప్రముఖ నటుడు అల్లు అర్జున్ ను చేర్చారు. తన నిర్వాకం కారణంగానే రేవతి అనే మహిళ చని పోయందని, మరొకరు తీవ్రంగా గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ఇదే సమయంలో బన్నీని అరెస్ట్ చేశారు. దీనిని సవాల్ చేస్తూ తను హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇవాల్టితో పూర్తి కావడంతో మరోసారి కోర్టును ఆశ్రయించారు అల్లు అర్జున్.