రాజస్థాన్ రాయల్స్ కోచ్ గా ద్రవిడ్..?
ఇంగ్లండ్ టి20 హెడ్ కోచ్ గా సంగక్కర
హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్టుకు మెంటార్, కోచ్ గా ఉన్న శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తప్పుకోనున్నాడా. ఆయన స్థానంలో మేనేజ్ మెంట్ రాహుల్ ద్రవిడ్ ను తీసుకోవాలని అనుకుంటుందని టాక్. కుమార సంగక్కర రాజస్థాన్ రాయల్స్ జట్టుకు నాలుగు ఏళ్ల పాటు కోచ్ గా సేవలు అందించాడు. ఆ జట్టును తీర్చి దిద్దడంలో కీలక పాత్ర పోషించాడు.
కాగా ప్రస్తుతం కుమార సంగక్కరను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంప్రదింపులు జరిపిందని, తమ టి20 ఫార్మాట్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండాలని కోరినట్లు ..దీనికి సంగక్కర కూడా ఓకే చెప్పినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో ఐపీఎల్ పరంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ జట్టులో సభ్యుడిగా, కెప్టెన్ గా , కోచ్ గా కూడా పని చేసిన అనుభవం భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కు ఉంది. ఈ నేపథ్యంలో తనను జట్టుకు కోచ్ గా ఉండాలని కోరినట్లు సమాచారం.
ది వాల్ కూడా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు హెడ్ కోచ్ గా ఉండేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ టీమ్ కు స్కిప్పర్ గా కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ నాయకత్వం వహిస్తుండడం విశేషం.