క్రీడా రంగానికి పెద్ద ఎత్తున ప్రోత్సాహం
ముంబై – టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. 25 ఏళ్ళ క్రిందటే క్రీడలకు ప్రాముఖ్యత ఇచ్చారని పేర్కొన్నారు. 2000 సంవత్సర కాలంలో జాతీయ క్రీడలను నిర్వహించారని, చాలా మంద్రి క్రీడాకారులకు ప్రోత్సాహం కల్పించారని అన్నారు. జాతీయ మీడియా రిపబ్లిక్ ఛానల్ ప్లీనరీ సమ్మిట్ 2025లో సానియా మీర్జా పాల్గొని ప్రసంగించారు.
అద్భుతమైన నాయకత్వ ప్రతిభ కలిగిన నాయకుడంటూ చంద్రబాబును ఆకాశానికి ఎత్తేశారు.
జీవితంలో ఎక్కువగా బాధ పడిన సంఘటన ఏదైనా ఉందంటే అది తాను ప్రాణ ప్రదంగా ప్రేమించిన టెన్నిస్ రంగం నుంచి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు అని పేర్కొన్నారు. లాల్ బహదూర్ స్టేడియంలో తాను ఊహించని రీతిలో అభిమానులు హాజరయ్యారని, వారందరి సమక్షంలో తాను నిష్క్రమించడం ఒకింత ఉద్విగ్నతకు లోనయ్యేలా చేసిందన్నారు సానియా మీర్జా.
ఇదిలా ఉండగా తన నాయకత్వం పట్ల ప్రశంసలు కురిపించిన మాజీ టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జాకు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్బంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు. తాము ఆమె సేవలను తప్పకుండా వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.