మోడీ ప్రయత్నం విఫలం సత్యానిదే విజయం
ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ కామెంట్స్
ఢిల్లీ – తమ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ విడుదల కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన హింసాత్మక ప్రయత్నాల్నీ బెడిసి కొట్టాయని, నిరాధారమైన ఆరోపణలు అని తేలి పోయాయని పేర్నొన్నారు. కుట్రలు, కుతంత్రాలు పని చేయలేదని సత్యేందర్ జైన్ స్పూర్తిని విచ్ఛిన్నం చేయలేక పోయాయని మండిపడ్డారు ఎంపీ.
దాదాపు 873 రోజుల పాటు సత్యేందర్ జైన్ పోరాటం చేశాడని కొనియాడారు. ఆయన సామాన్య ప్రజల కు చెందిన నాయకుడు. ఆయనపై తప్పుడు కేసులు పెట్టవచ్చు. లాఠీలతో దాడి చేయొచ్చు. జైల్లో పెట్టవచ్చు..కానీ ఆయన స్పూర్తిని విచ్చిన్నం చేయలేరని తేలి పోయిందన్నారు. సత్యేందర్ జైన్ స్పూర్తికి తాను వందనం చేస్తున్నానని చెప్పారు సంజయ్ ఆజాద్ సింగ్.
ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సత్యేందర్ జైన్ ను గత మే 30, 2022న ఈడీ అరెస్ట్ చేసింది. ఆయనకు నాలుగు కంపెనీలతో లోపాయికారి ఒప్పందం కలిగి ఉన్నారంటూ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
రూ. 50 వేలతో పాటు ఇద్దరు పూచీకత్తుపై సత్యేందర్ జైన్ బెయిల్ పై విడుదలయ్యారు. ఇదిలా ఉండగా అవినీతి నిరోధక చట్టం కింద 2017లో సీబీఐ జైన్ పై కేసు నమోదు చేసింది. దీంతో ఈడీ రంగంలోకి దిగింది. కాగా ఆప్ నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలు బయటకు వచ్చారు. ఒకరు మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా కాగా మరొకరు మాజీ సీఎం కేజ్రీవాల్.