ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
రాజస్థాన్ కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్
న్యూఢిల్లీ – కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారికి కీలకమైన రిజర్బ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ పదవిని కట్టబెట్టింది. ప్రస్తుతం మల్హోత్రా రెవెన్యూ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. డిసెంబర్ 10వ తేదీతో ప్రస్తుతం గవర్నర్ గా ఉన్న శక్తి కాంత దాస పదవీ కాలం ముగియనుంది.
సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్ కు చెందిన 1990 బ్యాచ్ ఐఏఎస్. రెవెన్యూ కార్యదర్శి కంటే ముందు ఆయన ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా పని చేశారు. ఇది విద్యుత్ ప్రాజెక్టులకు ఫైనాన్సింగ్ చేయడంలో ప్రత్యేకత కలిగిన ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ.
రెవెన్యూ కార్యదర్శిగా వస్తు,, సేవల పన్ను (జీఎస్టీ) సంస్కరణలను నిర్వహించడంలో అపారమైన అనుభవం ఉంది. జీఎస్టీ కౌన్సిల్ కు ఎక్స్ అఫిషియో కార్యదర్శిగా కూడా పని చేశారు. కాన్పూర్ లోని ఐఐటీలో చదువుకున్నారు. అమెరికాలోని ప్రిన్స్ టన్ విశ్వ విద్యాలయం నుండి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. సంజయ్ మల్హాత్రా ఆర్బీఐకి సంబంధించి 26వ గవర్నర్ కావడం విశేషం.