నిప్పులు చెరిగిన సంజయ్ నిరుపమ్
ముంబై – కాంగ్రెస్ మాజీ సీనియర్ నాయకుడు సంజయ్ నిరుపమ్ సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆరోపణలు చేయడం కలకలం రేపింది.
గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక పవర్ సెంటర్ ఉండేదన్నారు. కాగా హస్తంలో ఐదు పవర్ సెంటర్లు ఉన్నాయని ఆరోపించారు సంజయ్ నిరుపమ్. ఆ ఐదు ఎవరో కాదని వారిలో సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తో పాటు మరో ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ లు ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు.
ఇందులో ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేకమైన టీం ఉందన్నారు. వీటిని ప్రత్యేక శక్తి కేంద్రాలు ఉన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇలా పవర్ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం వల్ల పార్టీ కోసం ముందు నుంచి పని చేసే నేతలకు ఎలా న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు సంజయ్ నిరుపమ్.
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని షాక్ తగులుతోంది. సీనియర్ నాయకులు రాజీనామా పట్టారు. వారంతా గంప గుత్తగా బీజేపీలోకి జంప్ అయ్యారు.