సంజయ్ రౌత్ షాకింగ్ కామెంట్స్
చంద్రచూడ్ వల్లే ఓడి పోయాం
మహారాష్ట్ర – శివసేన బాల్ ఠాక్రే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు ఆయన వల్లనే తాము ఓడి పోయామంటూ పేర్కొనడం కలకలం రేపింది.
ఆయన ఫిరాయింపులను ప్రోత్సహించారని, ఆ దిశగా తీర్పులు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్. ఈ సందర్బంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి స్పందించారు. సంజయ్ రౌత్ చేసిన ఆరోపణలు అర్థరహితమని పేర్కొన్నారు.
ఒకరిపై విమర్శలు చేసే ముందు ఆలోచించుకుని మాట్లాడాలని హితవు పలికారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తమకంటూ ఓ బెంచ్ ఉంటుందన్నారు. ఎవరి పక్షం వహించే ప్రసక్తి ఉండదన్నారు. తాను అనేక కేసులను వాదించానని, ఆ అనుభవమే తనను సీజేఐగా చేసిందన్నారు.
తన పదవీ కాలంలో ఎన్నో విలువైన, కీలకమైన తీర్పులు వెలువరించడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు ఎలా నిర్వహించాలో, ఎలాంటి తీర్పులు ఇవ్వాలో మీ నుంచి నేర్చు కోవాల్సిన అవసరం లేదన్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సంజయ్ రౌత్.