చంద్రచూడ్ పై సంజయ్ రౌత్ కామెంట్స్
మరాఠాలో రాష్ట్రపతి పాలన విధించాలి
ముంబై – శివసేన పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాజాగా మరాఠాలో జరిగిన శాసన సభ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ ఆరోపించారు. ఇందుకు సంబంధించి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ ఎన్నికలు పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు.
రిజల్ట్స్ ప్రకటించినా ఇప్పటి వరకు సీఎం ఎవరనేది ప్రకటించ లేదన్నారు. ఈవీఎంలపై జాతీయ ఉద్యమాన్ని చేపడతామని ప్రకటించారు. షిండే సర్కార్ పూర్తిగా రాజ్యాంగ విరుద్దమన్నారు. ఈ సర్కార్ కు ఆనాడు చంద్రచూడ్ మద్దతు ఇచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు సంజయ్ రౌత్. శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన కేసులో విచారణను కావాలని ఆలస్యం చేశారని ఆవేదన చెందారు.
ఆనాడు వేటు వేసి ఉంటే ఎవరూ పార్టీని మార్చే వారు కారన్నారు.