NEWSNATIONAL

మోడీలో భ‌యం మొద‌లైంది

Share it with your family & friends

శివ‌సేన యుబిటి నేత సంజయ్ రౌత్

ముంబై – శివ‌సేన యుబిటి సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోడీపై నిప్పులు చెరిగారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తాజాగా దేశ వ్యాప్తంగా జ‌రిగిన ఎన్నికల్లో త‌ను ఒకానొక ద‌శ‌లో వార‌ణాసిలో ఓట‌మి అంచున దాకా వెళ్లార‌ని, తిరిగి అదృష్టం క‌లిసి వ‌చ్చి అతి క‌ష్టం మీద గెలుపొందార‌ని ఎద్దేవా చేశారు.

ఎంత కాల‌మ‌ని కులం పేరుతో మ‌తం పేరుతో రాజ‌కీయాలు చేస్తారంటూ ప్ర‌శ్నించారు సంజ‌య్ రౌత్. నాకు తెలిసి వార‌ణాసిలో మ‌రోసారి న‌రేంద్ర మోడీ పోటీ చేయ‌క పోవ‌చ్చ‌న్నారు. ఎందుకంటే త‌ను గెలుస్తాడో లేదో న‌న్న అనుమానంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాడని అన్నారు రౌత్.

వారణాసిలో అతని పరిస్థితి ఇలాగే ఉంటే, దేశ వ్యాప్తంగా అతని పరిస్థితి ఏంటి. ప్రధాని మోదీ మళ్లీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు నాయుడు, నితీశ్ కుమార్ లు ఇద్ద‌రూ త‌మ త‌మ ప్ర‌యోజ‌నాల కోసం ఎంత దాకానైనా వెళ‌తార‌ని అన్నారు. ఆ ఇద్ద‌రూ ఒకే చోట ఉంటార‌ని తాను భావించ‌డం లేద‌న్నారు.

ఇప్పుడు బీజేపీకి సంక‌ట స్థితి ఎదురవుతోంద‌ని పేర్కొన్నారు సంజ‌య్ రౌత్.