రాజ్ ఠాక్రేపై సంజయ్ రౌత్ ఫైర్
ఎవరి ఒత్తిళ్లతో ఎన్డీయేలో చేరారో చెప్పాలి
ముంబయి – మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీయేలో చేరడంపై తీవ్రంగా స్పందించారు శివసేన యుబీటీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్. ఆయన బుధవారం జాతీయ మీడియాతో మాట్లాడారు. ఎవరి ఒత్తిళ్ల మేరకు తను ఈ నిర్ణయం తీసుకున్నారో, ఎందుకు చేరాలని అనుకుంటున్నారో మరాఠా వాసులకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఇప్పుడు అకస్మాత్తుగా ఏం అవసరం వచ్చిందని తాను ఈ నిర్ణయం తీసుకున్నారో తనకే తెలియదని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు సంజయ్ రౌత్. మరాఠా ప్రజలు గత కొంత కాలంగా ఆయనను నమ్మారు. తన పార్టీకి మద్దతు ఇచ్చారు. మరాఠా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతాడని వారు ఏనాడూ అనుకోలేదన్నారు సంజయ్ రౌత్.
నిన్నటి దాకా శత్రువులుగా ఉన్న వారు ఇవాళ ఎలా స్నేహితులయ్యారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు .అసలు ప్రజలకు ఏం జవాబు ఇవ్వాలని అనుకుంటున్నారో కూడా స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటో కూడా తెలియాలి అన్నారు. ఇంతకు రాజ్ థాకరే పై ఏ ఫైల్ తెరిచారో , దానిని చూసి ఆయన భయపడి మద్దతు ఇచ్చారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు సంజయ్ రౌత్.