Friday, April 4, 2025
HomeNEWSNATIONALసంజ‌య్ రాయ్ కి జీవిత ఖైదు

సంజ‌య్ రాయ్ కి జీవిత ఖైదు

ఆర్జీక‌ర్ అత్యాచారం, హ‌త్య కేసు

కోల్ క‌తా – ఆర్జీ కర్ అత్యాచారం-హత్య కేసులో సంజయ్ రాయ్ కు పశ్చిమ బెంగాల్ కోల్ కతా కోర్టు జీవిత ఖైదు విధించింది. నగరంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి లోపల 31 ఏళ్ల డ్యూటీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ కు కోల్ కతాలోని సిబిఐ కోర్టు శిక్ష ఖ‌రారు చేసింది.

అత్యధిక భద్రత మధ్య ఉదయం 10:30 గంటల ప్రాంతంలో రాయ్ ను జైలు నుండి కోర్టుకు తరలించారు. సీల్దా కోర్టును పటిష్టంగా ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు.

ఇదిలా ఉండ‌గా దేశ వ్యాప్తంగా డాక్ట‌ర్ అత్యాచారం, హ‌త్య కేసు ఘ‌ట‌న సంచ‌ల‌నం సృష్టించింది. పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, ధ‌ర్నాలు కొన‌సాగాయి. సుప్రీంకోర్టు సైతం ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసుపై తీవ్రంగా స్పందించింది. వెంట‌నే తీర్పు వెలువ‌రించాలంటూ ఆదేశించింది. తీవ్ర వాదోప‌వాద‌న‌లు జ‌రిగిన అనంత‌రం కీల‌క తీర్పు వెలువ‌రించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments