NEWSNATIONAL

రౌత్ తో సంజ‌య్ సింగ్ భేటీ

Share it with your family & friends

ఢిల్లీలో కీలక ప‌రిణామం

న్యూఢిల్లీ – దేశ రాజ‌ధానిలో రాజ‌కీయాలు శ‌ర వేగంగా మారుతున్నాయి. ఓ వైపు ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు న‌రేంద్ర మోడీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ త‌రుణంలో ప‌శ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ చీఫ్ , సీఎం మ‌మతా బెన‌ర్జీ మేన‌ల్లుడు , ఎంపీ అభిషేక్ బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాము కూడా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించాడు.

త‌మ రాష్ట్రానికి చెందిన భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీలు త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని , త‌మ స‌ర్కార్ ఏర్పాటుకు బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఓకే చెప్పారంటూ బాంబు పేల్చారు. ఈ త‌రుణంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజ‌య్ ఆజాద్ సింగ్ హుటా హుటిన శివ‌సేన యుబిటీ ఎంపీ సంజ‌య్ రౌత్ తో ములాఖ‌త్ అయ్యారు.

వీరిద్ద‌రూ కీల‌క నాయ‌కులుగా ఉన్నారు. ఆప్ పార్టీ చీఫ్ , సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌స్తుతం ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో జైలులో ఉన్నారు. ప్ర‌స్తుతం ఆప్ స‌ర్కార్ న‌డుస్తున్నా సీనియ‌ర్ లీడ‌ర్ గా ఉన్న సింగ్ కింగ్ గా మారారు. అన్నీ తానై చూస్తున్నారు. ఈ త‌రుణంలో సంజ‌య్ రౌత్ ఇంటికి సంజ‌య్ సింగ్ వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.