పోరాడుతాం కానీ తలవంచం
నిప్పులు చెరిగిన సంజయ్ సింగ్
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ నిప్పులు చెరిగారు. తమ వద్ద 13 మంది ఎంపీలు ఉన్నారని , ఒప్పందం చేసుకోవాలంటే బీజేపీ ముందుకు వస్తుందన్నారు. కానీ అలాంటి చిల్లర, నీతి మాలిన పనులు చేసే పార్టీ తమది కాదని స్పష్టం చేశారు .
శుక్రవారం న్యూఢిల్లీలో సంజయ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. విలువలకు కట్టుబడి ఉన్నామని, ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతమైన విజయాన్ని ప్రజలు తమ ప్రతిపక్షాలతో కూడిన కూటమికి కట్ట బెట్టారని అన్నారు.
ఒక రకంగా చెప్పాలంటే తామే అసలైన విజేతలమని ప్రకటించారు. తాము నైతికంగా గెలిచామని కానీ మోడీ పరివారం, ఆయన సంకీర్ణ సర్కార్ అనైతికంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటూ సంచలన ఆరపోణలు చేశారు ఎంపీ సంజయ్ సింగ్.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఉద్యమ నేపథ్యంతో కూడిన చరిత్ర ఉందన్నారు. నిర్భయంగా మాట్లాడేందుకే తాము ఇక్కడికి వచ్చామని, కానీ తలవంచే ప్రసక్తే లేదన్నారు ఎంపీ.