సీఎం భార్య పట్ల వివక్ష తగదు
ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్
న్యూఢిల్లీ – జైలు అధికారులపై నిప్పులు చెరిగారు ఆప్ ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్. ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ ఒత్తిళ్ల మేరకే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలుసుకునేందుకు నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ ను కలవాలని ఆయన భార్య దరఖాస్తు చేసుకుందని చెప్పారు. ముఖా ముఖిగా కలిసేందుకు వీలు లేదంటూ స్పష్టం చేశారని మండిపడ్డారు. అమానీయమైన ప్రవర్తనగా దీనిని పేర్కొన్నారు సంజయ్ సింగ్. సీఎంను అవమాన పర్చేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
మర్డర్లు చేసిన వారికి, దారి దోపిడీలు సాగించిన వాళ్లకు, కరుడు గట్టిన నేరస్థులకు కలిసేందుకు వారి కుటుంబీకులను అనుమతి ఇస్తున్నారని, మూడు సార్లు ఢిల్లీకి ముఖ్యమంత్రిగా పని చేసిన కేజ్రీవాల్ భార్యకు ఎందుకు పర్మిషన్ ఇవ్వరంటూ ప్రశ్నించారు సంజయ్ ఆజాద్ సింగ్. ఇది పూర్తిగా కక్ష సాధింపు చర్య తప్ప మరోటి కాదని పేర్కొన్నారు.